జగిత్యాలలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఆందోళన..

by Sumithra |
జగిత్యాలలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఆందోళన..
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాలలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గురువారం ఆందోళన చేపట్టారు. ఉద్యోగ క్రమబద్ధీకరణ చేపట్టాలని కోరుతూ పట్టణంలోని కొత్తబస్టాండ్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన అనంతరం అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షుడు జేరిపోతుల కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన పనులలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నామన్నారు.

రెండు మూడు నెలలకు ఒకసారి జీతాలు వచ్చినా కూడా క్రమశిక్షణతో పనిచేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో జాయిన్ అయిన రోజు నుండి నేటి వరకు సర్వీస్ కాలంగా పరిగణించాలన్నారు. సీనియర్ అసిస్టెంట్ స్కేలుతో రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జగిత్యాల జిల్లాలో ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Next Story