మా భూమి నాకు ఇప్పించండి సారు.. 80 ఏండ్ల వృద్ధురాలి ఆవేదన..

by Sumithra |
మా భూమి నాకు ఇప్పించండి సారు.. 80 ఏండ్ల వృద్ధురాలి ఆవేదన..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : తమ భూమిని కబ్జా కోరల్లో నుండి విడిపించి తమకు అప్పగించాలని ఓ 80 ఏండ్ల వృద్ధురాలు జిల్లా కలెక్టర్ తో మొరపెట్టుకుంది. వేములవాడ పట్టణానికి చెందిన వేముల నాగవ్వకు పట్టణ శివారులోని 696, 697 సర్వే నంబర్లలో ఎకరం 20 గుంటల భూమి ఉంది. కాగా అదే పట్టణానికి చెందిన పొనుగుంటి బుచ్చయ్య అనే వ్యక్తి తమకు తెలియకుండా పట్టా చేయించుకున్నాడని, సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ఫిర్యాదు చేసింది.

అనంతరం నాగవ్వ మాట్లాడుతూ చాలా ఏండ్ల నుంచి ఆ భూమిలో వ్యవసాయం చేసుకున్నామని, 20 ఏళ్ల క్రితం తన భర్త పెంటయ్య చనిపోతే ఆ భూమిలోనే అంత్యక్రియలు చేసి, సమాధి కూడా కట్టామని ఆవేదన వ్యక్తం చేసింది. తర్వాత ఆ భూమిని బుచ్చయ్య అనే వ్యక్తి కబ్జా చేశాడని, ఎక్కడికి వెళ్లినా తనకు న్యాయం జరగడం లేదని నాగవ్వ కన్నీరు మున్నీరయింది. తమ భూమిని తమకు అప్పగించి, కబ్జా చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను వేడుకుంది.

Advertisement

Next Story