‘మోడీ, కేసీఆర్‌లను కన్నడ ప్రజలు రిజెక్ట్ చేశారు’

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-13 10:20:15.0  )
‘మోడీ, కేసీఆర్‌లను కన్నడ ప్రజలు రిజెక్ట్ చేశారు’
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్వేషపూరిత రాజకీయాలకు కర్ణాటక ప్రజలు చరమ గీతం పాడారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రం నుంచి బీజేపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీపై బీజేపీ కక్ష్య కట్టి పదవీచీత్యుడిని చేసిందో అదే రాష్ట్ర ప్రజలు బీజేపీని ఇంటికి పంపించారని ద్వజమెత్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శనివారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇది ఆరంభం మాత్రమేనని భారత్ జోడో యాత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ నమోదు చేసుకున్న రెండో ఫలితం ఇదని గుర్తు చేశారు. దేశంలో భారత్ జోడో యాత్ర ఫలితాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ ప్రభంజనం ఇక్కడితో ఆగిపోదన్నారు.

త్వరలో ఢిల్లీలోనూ పార్టీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో కర్ణాటక ఫలితాలు పెను మార్పు తీసుకురాబోతుందన్నారు. శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చూసిన బీజేపీకి కర్ణాటక ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. మతాన్ని చాటు రాజకీయాలకు దేశంలో కాలం చెల్లిందన్నారు. కర్ణాటకలో మోడీ రాజకీయ ప్రయోజనాలకే ప్రయత్నం చేశాడని ఇక్కడ బీజేపీని ఓడించడం ద్వారా ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీని తిరస్కరిస్తే జేడీఎస్‌ను ఓడించడం ద్వారా కేసీఆర్‌ను తిరస్కరించారన్నారు. హంగ్ ఫలితాల ద్వారా తన మనుగడ సాధించుకోవాలనుకున్న కేసీఆర్‌ను కర్ణాటక ప్రజలు తిరస్కరించి సుస్థిర ప్రభుత్వానికి అవకాశం కల్పించారన్నారు.

కర్ణాటక ఫలితాలను తెలంగాణ కాంగ్రెస్ స్వాగతిస్తోందన్నారు. దక్షిణ భారత దేశంలో నరేంద్ర మోడీని ప్రజలు తిరస్కరించారనే సంగతి కర్ణాటక ఫలితాలతో స్పష్టం అయిందన్నారు. రేపు తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలే రిపీట్ అవుతాయని బీఆర్ఎస్‌ను గద్దె దింపి కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీఎస్ ప్లాన్ బీ అమలు చేసినా వారివి దింపుడు కళ్లం ఆశలేనని ఎద్దేవా చేశారు. జేడీఎస్‌కు కేసీఆర్ మద్దతిచ్చారని ఇప్పుడు బీజేపీతో జేడీఎస్ మంతనాలు జరుపుతుందంటే దీన్ని కేసీఆర్ సమర్ధిస్తారా అని ప్రశ్నించారు.

Read More... తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతుందా?

Advertisement

Next Story

Most Viewed