సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నా.. గెలిపించండి: కేఏ పాల్

by Javid Pasha |   ( Updated:2023-10-17 10:24:01.0  )
సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నా.. గెలిపించండి: కేఏ పాల్
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న తెలంగాణ ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. తనను ప్రజలు గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతానని అన్నారు. గత కొద్దిరోజులుగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కేఏ పాల్ పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు తనను ఆదరించాలని కోరుతున్నారు. తాజాగా నియోజకవర్గంలోని అడ్డగుట్ట డివిజన్‌లో పాల్ పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నానని, తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కాదని, ప్రజలను మోసం చేయడానికే సాధ్యం కాని హామీలు ఇచ్చారని ఆరోపించారు. బంగారు తెలంగాణ చేస్తానని మాయమాటలు చెప్పి ప్రజలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.

Next Story

Most Viewed