- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jurala Project : జూరాల 5 గేట్లు ఎత్తివేత.. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
by Sathputhe Rajesh |
X
దిశ, గద్వాల : ఎగువ ప్రాజెక్టుల నుండి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులలో గేట్లు ఎత్తివేయడంతో భారీ వరద నీరు జూరాల ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. శనివారం ఉదయం జూరాలకు సుమారు 76,238 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. జూరాల జలాశయం నుంచి 5 గేట్ల ద్వారా 19,680 క్యూసెక్కులు, జల విద్యుత్ ద్వారా 36,491 క్యూసెక్కుల చొప్పున మొత్తం 60,986 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత 7.682 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకు గాను ప్రస్తుత నీటిమట్టం 317.520 మీటర్లు ఉన్నాయి.
Advertisement
Next Story