- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒక్క రాత్రిలో అంతా సెట్ చేయలేం: మంత్రి జూపల్లి
దిశ, డైనమిక్ బ్యూరో: తొమ్మిది సంవత్సరాల అస్తవ్యస్త పరిపాలనను ఒక్క రాత్రిలో మార్చలేమని దీన్నంతటిని సెట్ చేసేందుకు మార్గాలను పరిశీలిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు శాఖల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలను అందిస్తానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్సైజ్, పర్యాటక శాఖలపై తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై సమీక్షలు చేపట్టి తీసుకురావాల్సిన మార్పులపై అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత పాలకులు 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. ఇంత చేసినా రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకోలేని పరిస్థితికి తెచ్చారన్నారు. వీటన్నింటిని మార్చేందుకు ఉన్నపళంగా నిర్ణయాలు సాధ్యం కాదన్నారు. ఇటీవల టూరిజం శాఖ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.
తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జూపల్లి కృష్ణారావు.
— Congress for Telangana (@Congress4TS) December 11, 2023
Jupalli Krishnarao took charge as Telangana Excise and Tourism Minister.#JupallyKrishnaRao #TelanganaPrajaPrabhutwam @jupallyk_rao pic.twitter.com/fJzqfUW4zw