Whatsapp New Feature: వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ లాంచ్.. ఇకపై ఆ సమస్యకు చెక్..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-20 15:24:15.0  )
Whatsapp New Feature: వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ లాంచ్.. ఇకపై ఆ సమస్యకు చెక్..!
X

దిశ, వెబ్‌డెస్క్: మెటా(Meta) సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్(Whatsapp)ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగానే యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ల(New Features)ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. కాగా వాట్సాప్ ఇటీవలే మెసేజ్ రిమైండర్(Message Reminder) సదుపాయాన్ని తీసుకురాగా.. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తేనుంది. తమ యాప్(App)లో గ్రూప్ కాల్స్‌(Group Calls)కు సంబంధించిన కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టనున్నట్లు వాట్సాప్ తాజాగా వెల్లడించింది.

ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ కాలింగ్ మరింత ఈజీ(Easy) కాబోతోందని కంపెనీ తెలిపింది. కాగా ప్రస్తుతం గ్రూప్ కాల్ చేస్తే ఆ గ్రూప్‌లోని సభ్యులందరికీ ఒకేసారి కాల్ వెళ్తోంది. అయితే, కొత్త ఫీచర్ ద్వారా గ్రూప్‌లోని సభ్యుల్లో ఎవరికి మాత్రమే కాల్ చేయాలనుకుంటున్నారో, వారి నంబర్లను మాత్రమే సెలక్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ సదుపాయం కాల్ చేసే సభ్యుడికి అనవసరమైన ఇబ్బందులను తగ్గిస్తుందని వాట్సాప్ పేర్కొంది. అలాగే క్రిస్మస్(Christmas), న్యూ ఇయర్(New​ Year)ను దృష్టిలో పెట్టుకొని త్వరలో ఫన్నీ ఎఫెక్ట్స్(Funny Effects) అనే ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపింది.



Next Story

Most Viewed