Jupally Krishna Rao: తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసిన కేంద్రం: మంత్రి జూపల్లి ఫైర్

by Shiva |
Jupally Krishna Rao: తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసిన కేంద్రం: మంత్రి జూపల్లి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, ఆర్థిక రంగ నిపుణులు బడ్జెట్‌పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి నిరాశజనకంగా ఉందని ధ్వజమెత్తారు. తెలంగాణకు రూపాయి నిధులు కూడా కేటాయించకపోవడం పక్షపాత ధోరణినికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. బీజేపీకి ఓట్లు మాత్రమే కావాలని.. రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోకుండా మొండిచేయి చూపి మోసం చేశారని ఆరోపించారు. బడ్జెట్‌లో విభజన హామీలను ప్రస్తవించకపోవడం దారుణమని అన్నారు. ఎన్టీఏ సర్కార్ ఏర్పడేందుకు కీలక పాత్ర పోషించిన ఏపీ, బిహార్, అసోం రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్‌లో అగ్రతాంబూలం ఇచ్చారని ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed