నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

by M.Rajitha |   ( Updated:2024-08-28 16:11:23.0  )
నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,280 పోస్టులు ఉండగా.. వాటిలో 1654 గెస్ట్ లెక్చరర్స్, 449 కాంట్రాక్ట్ లెక్చరర్స్, 96 పార్ట్ టైమ్, 78 అవుట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ లెక్చరర్ల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2025 మార్చి వరకు వీరు కాలేజీల్లో బోధించేందుకు ఇంటర్ విద్యాశాఖ ఈ నియామకాలు చేపట్టనుంది.

Advertisement

Next Story

Most Viewed