తెలంగాణ అసెంబ్లీలో Jr.NTR సినిమా ప్రస్తావన

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-13 13:40:30.0  )
తెలంగాణ అసెంబ్లీలో Jr.NTR సినిమా ప్రస్తావన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి తారక రామారావు(Jr.NTR) సినిమా ప్రస్తావనకు వచ్చింది. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Aadi Srinivas) మాట్లాడుతూ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ‘జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన బాద్ షా సినిమా(Baadshah Movie)లో నటుడు బ్రహ్మానందం ఊహాలోకంలో బతికేస్తాడు. పడుకొని నిద్రలో తాను ఏం చేయాలనుకుంటారో చేసేసినట్లు ఊహించుకుంటాడు’ అచ్చం అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా వ్యవహరిస్తున్నారు. ఇంకా వారే అధికారంలో ఉన్నట్లు.. వారు అనుకున్నవే జరగాలని కోరుకుంటున్నారని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు.. ఇవాళ అసెంబ్లీ సమావేశం హాట్ హాట్‌గా జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాదోప వాదనలు జరుగడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినా.. జగదీష్ రెడ్డి చెప్పకపోవడంతో స్పీకర్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండిస్తూ ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని తెలంగాణ భవన్‌కు తరలించారు.

Next Story

Most Viewed