- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కుట్ర: మాజీ మంత్రి
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత జోగు రామన్న కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లో పత్తి విత్తనాల కోసం వెళ్తే లాఠీఛార్జ్ చేశారని చెప్పారు. బీఆర్ఎస్ హయంలో ఒక లక్ష 20 వేళ ప్యాకెట్స్ పత్తి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అడిగిన పత్తి విత్తనాలను ఇవ్వడం లేదని మండిపడ్డారు. నోరు తెరిచి అడిగితే రైతులపై లాఠీఛార్జ్ చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున రైతులతో కలసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. రైతుల సమస్యలను పక్కన పెట్టి తెలంగాణ రాజ ముద్రను మార్చే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అడుగుపెట్టిన వెంటనే రాష్ట్ర రైతుల పరిస్థితి ఆగమైందని విమర్శించారు. మార్పు అని అధికారంలోకి వచ్చారు.. ఇదేనా మార్పు అని ఎద్దేవా చేశారు. నూతన మద్యం టెండర్ల విషయం నాకు తెలియదని మద్యం మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారు.. ముఖ్యమంత్రికి, మంత్రులకు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, తమ స్వార్థ ప్రయోజనాల కోసం పదవులు అనుభవిస్తున్నారని సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల సమస్యల పక్కన పెట్టి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ట్యాక్స్‌ల పేరుతో వసూల్ చేసిన డబ్బులను ఢిల్లీకి పంపిస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. పంట పొలాలు ఎండిపోయి 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. రుణమాఫీ పేరుతో పబ్బం గడపకుండా, రైతు భరోసా ఎప్పటి వరకు ఇస్తారో తుమ్మల నాగేశ్వరరావు చెప్పాలని డిమాండ్ చేశారు.