JEE 800 ranker addicted to ganja: గంజాయికి బానిసైన జేఈఈ 800 ర్యాంకర్

by Indraja |
JEE 800 ranker addicted to ganja: గంజాయికి బానిసైన జేఈఈ 800 ర్యాంకర్
X

దిశ వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలు మాదక ద్రవ్యాల మత్తులో ముగితేలుతున్నాయి. ముఖ్యంగా యువత గజాయి మత్తులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిత్యం పోలీసు యంత్రాంగం తిరిగే ప్రాంతాల్లో సైతం గంజాయిని విక్రయిస్తున్నా, నడిరోడ్డుపై గంజాయి సేవిస్తూ పేక ఆడుతున్నా పోలీసులు కనీస చర్యలు తీసుకోవడంలేదు అని భాగ్యనగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా గంజాయి సేవిస్తూ జేఈఈలో ఆలిండియా 800 ర్యాంకర్ పట్టుబడడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన నవీన్‌నాయక్‌ (27) అనే యువకుడు గతంలో జేఈఈ ప్రవేశ పరీక్ష రాశారు. కాగా ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించి ఆలిండియా 800 ర్యాంకర్‌గా నిలిచారు. దీనితో అతను కోరుకున్నట్టుగానే అతనికి త్రిసూర్‌లోని నిట్‌ కళాశాలలో బీటెక్‌ చదివేందుకు ప్రవేశం లభించింది.

అనుకున్నట్టే తనకు నచ్చిన త్రిసూర్‌లోని నిట్‌ కాలేజీలో బీటెక్‌లో చేరాడు. ఈ క్రమంలో చదవక ముందు కాకరకాయ చదివినంక కీకరకాయన్న చందంగా నవీన్ తీరు మారింది. అప్పటి వరకు చదువే ద్యాసగా సాగిన అతని జీవితం చెడు స్నేహాలతో గంజాయి కబంధహస్తాల్లోకి చేరింది. దీనితో చదువుకు స్వస్తి పలికాడు నవీన్. గంజాయి మత్తులో ప్రపంచాన్నే మరిచిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.

ఆలిండియా 800 ర్యాంకర్‌గా వార్తల్లో నిలిచి కన్నవాళ్లకి, ఉన్న ఊరికి మంచి పేరు తెచ్చిన నవీన్, ఇప్పడు గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడి అపకీర్తిని మూటగట్టుకున్నాడు. మదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో టీజీన్యాబ్‌ ఎస్పీ సాయిచైతన్య, డీసీపీ జీ వినీత్‌ తెలిపిన సమాచారం ప్రకారం..హైదరాబాద్‌లోని దూద్‌బౌలికి చెందిన మోతికార్‌ సచ్చితానంద్‌, దూల్‌పేట్‌ ప్రాంతానికి చెందిన రాజా ఇరువురు కలిసి గతకొంతకాలంగా అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం సచ్చితానంద్‌ మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైటెక్స్‌ ప్రాంతంలో గంజాయిని విక్రయిస్తున్నారని టీజీన్యాబ్‌, మాదాపూర్‌ పోలీసులకు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందింది. సామాచారం అందుకున్న టీజీన్యాబ్‌, మాదాపూర్‌ పోలీసులు హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకుని దాడిచేశారు. ఆ దాడిలో గంజాయిని విక్రయిస్తున్న సచ్చితానంద్‌‌తోపాటు గంజాయిని కొనుగోలు చేస్తున్న గతంలో జేఈఈలో ఆలిండియా 800 ర్యాంకు సాధించిన నవీన్ నాయక్, బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన రాహుల్‌రాజ్‌ (27), కూకట్‌పల్లికి చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ ప్రణీత్‌రెడ్డి (25)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా మరో నిందితుడు రాజా పరారీలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed