ఇంట్లో కూలర్‌ వాడుతున్నారా..? జాగ్రత్త.. జవాన్ ప్రాణం తీసింది కూలరే..!

by sudharani |
ఇంట్లో కూలర్‌ వాడుతున్నారా..? జాగ్రత్త.. జవాన్ ప్రాణం తీసింది కూలరే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సమ్మర్ వచ్చేసింది. దీంతో ప్రతి ఒక్కరి ఇంట్లో కూలర్లు వాడటం సర్వసాధారణంగా మారింది. కానీ, అవి చాలా ప్రమాదకరం. వాటిలో నీళ్లు నింపేటప్పుడు కనీస జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. గతంలో ఓ సారి కూలర్ షాక్ తగిలి ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి సంఘటనే తెలంగాణలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

ములుగు జిల్లా వాజేడు మండలం శ్రీరామ్ నగర్‌కు చెందిన మనోజ్ కుమార్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సెలవులు కారణంగా ఇంటికి వచ్చిన అతడు.. కూలర్‌లో నీళ్లు నింపుతుండగా ప్రమాదవసాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. విద్యుత్ షాక్‌తో ITBP జవాన్ మనోజ్ కుమార్ మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నోట్: కూలర్లో నీళ్లు నింపేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించండి. కరెంట్ ఆఫ్ చేసి నీళ్లు నింపే ప్రయత్నం చేయండి.

Advertisement

Next Story