- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
T.Conress: రెడ్డి సామాజికవర్గ నేతలకు జగ్గారెడ్డి కీలక విజ్ఞప్తి

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) వ్యాఖ్యలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) స్పందించారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల బాధ పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పట్ల వ్యతిరేక భావంతో ఉండొద్దు. అన్ని కులాలతో రెడ్డి సామాజికవర్గం సఖ్యతగా ఉంటుంది. ఎవరో ఏదో అన్నారని తొందరపడవద్దు.. రెడ్డి సామాజికవర్గ నేతలు ఓపికతో ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ’ అని జగ్గారెడ్డి సూచించారు.
అంతకుముందు.. అంజన్ కుమార్ యాదవ్ కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను బీఆర్ఎస్(BRS) నేతలు వక్రీకరించారని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని కులగణనను తెలంగాణ చేసి చూపించిన ప్రభుత్వాన్ని, దానికి కారణమైన రాహుల్ గాంధీ(Rahul Gandhi), రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని అభినందించడానికే తాము సభ నిర్వహించామని.. ఆ సమావేశంలో తాను మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వారికి అనుకూలంగా మార్చుకుని సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కాగా, హైదరాబాద్ వేదికగా జరిగిన యాదవ కుల సంఘం సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒక సామాజికవర్గ నేతలు యాదవులను రాజకీయంగా ఎదగనీయంగా అడ్డుకుంటున్నారని.. ఇక నుంచి తమ సామాజికవర్గాన్ని తక్కువ చేసి చూసినా, పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఊరుకునే ప్రసక్తే లేదని ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి.