MLA పోచారం పార్టీ మార్పుపై జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |
MLA పోచారం పార్టీ మార్పుపై జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి.. అధికారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ సమక్షంలో పోచారం ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి హస్తం గూటికీ చేరారు. అనుహ్యంగా పోచారం పార్టీ మారడం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోచారం బీఆర్ఎస్‌ను వీడటం దురదృష్టకరమని అన్నారు.

ఏమి ఆశించి పోచారం కాంగ్రెస్‌లోకి వెళ్లారో తెలియదన్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పోచారం కేసీఆర్ దగ్గరే ఉండి దైర్యం చెప్పారని, స్వయంగా పోచారం ఎన్నో సార్లు కేసీఆర్ గొప్పతనాన్ని కొనియాడారని గుర్తు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్ ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు. పోచారం ఇంటి దగ్గరకు వెళ్లిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్, తదితరులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోచారం బీఆర్ఎస్ నేత కనుక ఆయన ఇంటికి మా నేతలు వెళ్లారని అన్నారు.

బీఆర్ఎస్ నేతలపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వారిని విడుదల చేయాలని కోరారు. ఈ దేశంలో కేసీఆర్‌కు రాజకీయ పార్టీలతో పాటు మీడియాలో కూడా ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని సెటైర్ వేశారు. కేసీఆర్‌ను రాజకీయ ముఖ చిత్రం నుంచి అదృశ్యం చేయాలంటే కుదిరే పని కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌కు ఇలాంటి ఒడి దొడుకులు కొత్త కాదని అన్నారు.2001 నుంచి ఇలాంటివి ఎన్నో చూస్తున్నామని, రాజకీయపార్టీలకు ఎత్తు పల్లాలు సహజమన్నారు. ఫీనిక్స్ పక్షిలా కేసీఆర్ మళ్ళీ లేచి నిలబడతారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed