Jagadish Reddy: పదేళ్లు కేసీఆర్ ఏం చేశారో ప్రజలకు తెలుసు.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

by Shiva |
Jagadish Reddy: పదేళ్లు కేసీఆర్ ఏం చేశారో ప్రజలకు తెలుసు.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ (KCR) రాష్ట్రానికి ఏం చేశారో ప్రజలకు అన్ని విషయాలు తెలుసునని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. నీళ్లలో నిప్పులు పుట్టించి ఉద్యమం నడిపిన పార్టీ బీఆర్ఎస్ (BRS) అని అన్నారు. తెలంగాణ (Telangana)లో అన్ని విషయాల్లో పరిశోధించిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. రాష్ట్రంలో దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిందని కామెంట్ చేశారు. కృష్ణ జలాల (Krishna Water) విషయంలో ప్రభుత్వానికి సోయి లేదని ఫైర్ అయ్యారు. ఏపీ జలదోపిడీని అడ్డుకోండంటూ హరీశ్ రావు సలహా ఇస్తే.. తిరిగి మాపైనే నిందలు వేస్తున్నారని అన్నారు. శ్రీశైలం (Srisailam), నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్ట్‌లలో వాటాకు మించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) నీళ్లు తీసుకెళ్తోందని ఆరోపించారు. సాగర్ ఎడమ కాల్వ కింద సాగు, తాగు నీరుకు ఇబ్బంతులు తలెత్తే పరిస్థితి నెలకొందని జగదీశ్ రెడ్డి అన్నారు.

జల దోపిడీకి సహకరించింది బీఆర్ఎస్సే.. మంత్రి ఉత్తమ్

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) ఏపీ జల దోపిడీకి సహకరించిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆరోపించారు. కేఆర్ఎంబీ‌ (KRMB) ముందు రాష్ట్రానికి 298 టీఎంసీ నీళ్లు సరిపోతాయని చెప్పి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లలో కనీసం టెలిమెట్రి (Telemetry) పరికరాలు పెట్టలేదని ఫైర్ అయ్యారు. శ్రీశైలం (Srisailam) నుంచి 1,200 టీఎంసీలు ఏపీకి అక్రమంగా తరలించారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక కేఆర్ఎంబీ (KRMB)కి ఫిర్యాదు చేశామని.. అప్పటి నుంచి ఏపీపై ఆంక్షలు పెట్టారని గుర్తు చేశారు. చేసిన తప్పులు ఒప్పుకోకుండా బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు చెబుతోందని అన్నారు. తెలంగాణలో నీళ్ల కష్టాలకు కారణం బీఆర్ఎస్ పార్టీ (BRS Party)నే అని ప్రాజెక్టుల పేరుతో నిలువు దోపిడీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. చివరికి నాగార్జున సాగర్‌ను కేంద్రానికి అప్పగించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

Next Story