ఐటీ దాడులు.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రియాక్షన్

by Sathputhe Rajesh |
ఐటీ దాడులు.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు చేస్తోంది. అయితే తాజాగా ఐటీ దాడులపై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. నిన్నటి నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నా సెల్ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు వ్యాపారం చేయొద్దని రాజ్యాంగంలో ఉందా? అన్నారు. వ్యాపారానికి తగినంత పన్ను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.200 కోట్ల పన్ను కట్టాం. సోదాలు చేస్తున్న ఐటీ అధికారులే క్లీన్ చీట్ ఇచ్చి వెళ్తారు. ఐటీ అధికారులకు పూర్తిగా కో ఆపరేట్ చేస్తున్నా.. అన్నారు.

Next Story

Most Viewed