Minister Ponnam : కుల సర్వేలో పాల్గొనేలా చేయాల్సిన బాధ్యత మీదే : మంత్రి పొన్నం

by Y. Venkata Narasimha Reddy |
Minister Ponnam : కుల సర్వేలో పాల్గొనేలా చేయాల్సిన బాధ్యత మీదే : మంత్రి పొన్నం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కుల గణన సర్వే(Caste Census Survey)లో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)స్పష్టం చేశారు. కుల గణన సర్వే నేటితో ముగియ్యనుందని...ఇంకా సర్వేలో పాల్గొనని వారు, ఎన్యుమారెటర్లకు వివరాలు ఇవ్వని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని సూచించారు.

ఎక్కడెక్కడ ఇంకా కుల సర్వేలో పాల్గొనలేదో అక్కడ కుల సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు, మేధావులు ఫ్రొఫెసర్లు వారికి అవగాహన కల్పించాలని..వారు ఈరోజు కుల సర్వేలో పాల్గొనేలా చేయాల్సిన బాధ్యత మీదేనని పొన్నం స్పష్టం చేశారు. కుల గణనలో పాల్గొనని వారికి ప్రభుత్వం ఈ నెల 16 నుండి 28 వరకు అవకాశం ఇవ్వడంతో సర్వే గడువు నేటితో గడువు ముగుస్తుందన్నారు. సర్వే లో పాల్గొనని వారు నేడు చివరి రోజు కావడంతో కుల గణన సర్వేలో పాల్గొని సమాచారం ఇవ్వండని, కుల గణన సర్వే కోసం టోల్ ఫ్రీ నం. 040-211 11111ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

తాము కుల సర్వేలో పాల్గొనలేదని ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి ఎన్యుమరేటర్లు వచ్చి వివరాలు నమోదు చేస్తున్నారని, ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ లలో వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్ లో నమోదు చేసుకునే వారు https://seeepcsurvey.cgg.gov.in ద్వారా తమ సమాచారాన్ని ఇవ్వవచ్చన్నారు. సర్వేలో పాల్గొని అందుతున్న పథకాలకు అర్హులుగా ఉండాలని..సర్వేలో పాల్గొనని వారిని భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని పొన్నం ఎక్స్ వేదికగా తెలిపారు.

Next Story

Most Viewed