- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Telangana Bill: 'ది బిల్ ఈస్ పాస్డ్'.. రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాసై నేటికి 11 ఏండ్లు

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిన రోజు నేడు.. ఫిబ్రవరి 20, 2014 న తెలంగాణ బిల్లు (Telangana Bill) ఆమోదం పొందింది. పార్లమెంట్‌లో (రాజ్యసభలో) తెలంగాణ బిల్లు (bill is passed) పాసై నేటితో 11 ఏండ్లు అయ్యింది. 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైంది. లోక్‌సభలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపి వేసి మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును 2014 ఫిబ్రవరి 18న ఆమోదించినట్లు స్పీకర్ మీరా కుమార్ తెలిపారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో.. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో నాటి హోంమంత్రి షిండే బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ అరుణ్ జైట్లీ తెలంగాణకు మద్దతు ప్రకటించారు. అనంతరం ‘ది బిల్ ఈస్ పాస్డ్’ అంటూ డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించడంతో తెలంగాణ కొత్త చరిత్రకు నాంది పలుకుతూ ఏపీ విజభన పూర్తయింది. ఇక, 2014 మార్చి 1న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు రాజముద్ర పడింది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించారు.
ఈ క్రమంలోనే గురువారం బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా పలు విషయాలను పంచుకుంది. 'ది బిల్ ఈస్ పాస్డ్' అనే శబ్దం విజయ శంఖారావమై వినిపించిన రోజు అని, తెలంగాణ ప్రజల 60 ఏండ్ల త్యాగాల నిరీక్షణ ఫలించిన రోజు అని తెలిపింది. గులాబీ జెండా చేత పట్టి ప్రాణాలను పణంగా పెట్టి రక్తమోడని రణరంగంలో కాలాన్ని గెలిచిన రోజు.. ఉద్యమ సారథి కేసీఆర్ శాంతియుత రాజకీయ పంథాకు పార్లమెంట్ ప్రణమిల్లిన రోజు అని బీఆర్ఎస్ పంచుకుంది.