రాహుల్ గాంధీ ఇచ్చిన “మొహబ్బత్ కి దుకాన్” ఇదేనా?.. నిరుద్యోగుల ధర్నాపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |
రాహుల్ గాంధీ ఇచ్చిన “మొహబ్బత్ కి దుకాన్” ఇదేనా?.. నిరుద్యోగుల ధర్నాపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగులకు రాహుల్ గాంధీ ఇచ్చిన “మొహబ్బత్ కి దుకాన్” ఇదేనా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులు శనివారం రాత్రి చిక్కడ్ పల్లి నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీనికి సంబందిచిన వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం పలు విమర్శలు చేశారు. ఎన్నికల ముందు అశోక్ నగర్‌లోని నిరుద్యోగ యువతకు రాహుల్ గాంధీ ఇచ్చిన “మొహబ్బత్ కి దుకాన్” ఇదేనా? అని ప్రశ్నించారు. అలాగే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నిరసనలు తెలుపుతున్న ప్రభుత్వ ఉద్యోగ ఆశావహుల మనోవేదనలను పరిష్కరించాలని కోరారు. పరీక్షల షెడ్యూలింగ్, పోస్టుల పెంపు, ఉద్యోగాల క్యాలెండర్‌కు సంబంధించిన సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరసనలను అణచివేయడానికి ప్రయత్నించకుండా నిరుద్యోగ యువతతో వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి చర్చలు జరపాలని బండి సంజయ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed