పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో.. 60 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలి : సీపీ అనురాధ

by Kalyani |
పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో.. 60 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలి : సీపీ అనురాధ
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులలో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసు కమిషనర్ అనురాధ ఆదేశించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ల పెండింగ్ కేసులపై సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. 2023, 2024, 2025 అండర్ ఇన్వెస్టిగేషన్, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి ఏసీపీ సీఐలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ... క్రికెట్ బెట్టింగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి ఉక్కు పాదంతో అణిచి వేయాలన్నారు. నూతన టెక్నాలజీని అధికారులు సిబ్బంది అందిపుచ్చుకోవాలన్నారు. కేసు నమోదైన వెంటనే నిందితులను అరెస్టు చేయాలన్నారు. ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యను పరిష్కరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనాల నివారణకు బ్లూ కోల్డ్స్, పెట్రో కార్ అధికారులు సిబ్బంది అప్రమత్తం గా విధులు నిర్వహించాలని ఆదేశించారు. డయల్ 100 కాల్స్ పై అలసత్వం వహించ వద్దు అన్నారు. ఈ సమావేశంలో సిద్దిపేట ఏసీపీ మధు, ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, శ్రీనివాస్, ఏఓ యాదమ్మ, సూపరింటెండెంట్ ఫయాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

మే 13 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు..

పోలీస్ కమిషనరేట్ పరిధిలో మే 13వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ. అనురాధ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. బంద్ ల పేరిట వివిధ కారణాలు చూపుతూ బలవంతంగా సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకి నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. దీనికి తోడు కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ వినియోగం పై నిషేధాజ్ఞలు మే 13వ తేది వరకు అమలులో ఉంటుందన్నారు. పై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ. అనురాధ హెచ్చరించారు.


Advertisement
Next Story

Most Viewed