- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు మెయిన్ రీజన్ అదే.. భారత్ సమ్మిట్‌లో CM రేవంత్ క్లారిటీ

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతోన్న భారత్ సమ్మిట్-2025(Bharat Summit 2025)లో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. పదేళ్లు బీఆర్ఎస్ కాలయాపన చేసింది కాబట్టే.. ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంపూర్ణ నమ్మకంతో ఉన్నారని తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. అధికారంలోకి వచ్చిన తక్కువ రోజుల్లోనే రూ.20 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. దేశంలోనే ఇది పెద్ద నిర్ణయమని చెప్పారు. రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.12,000 ఇస్తున్నాం.. ఉపాధి హామీ కార్డు దారులకు సాయం చేస్తున్నాం.. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తున్నాం.. దీనికి తోడు రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. అంతేకాదు.. సర్టిఫికేట్ ఉన్నా.. నైపుణ్యం లేక ఉద్యోగ అవకాశాలు దొరకడం లేవని..అందుకే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏడాదిన్నరలోనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చిన నిరుద్యోగులను ఆదుకున్నట్లు తెలిపారు.
తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించాం.. దావోస్ నుండి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చామని అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ అజెండాగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మహిళా పారిశ్రామికవేత్తలను బడా పారిశ్రామికవేత్తలుగా చేయాలనేది తమ ఆలోచన అని అన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం.. ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.