- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్.. ఆ విషయంలో చర్చలకు సిద్దమా? మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాల గురించి మాట్లాడితే తెలియదు కావచ్చు అనుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తాజాగా ట్వీట్ చేశారు. పదేళ్లు మంత్రిగా ముఖ్యమంత్రి కుమారుడిగా ఉండి అత్తర బత్తరగా మాట్లాడితే ఎలా కేటీఆర్‌ను ప్రశ్నించారు. సూటి ప్రశ్న అడుగుతున్న కేటీఆర్.. 23 ఏళ్ల నుంచి మీ పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క బలహీన వర్గానికి చెందిన వారు అయిన అధ్యక్షుడు అయ్యారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందన్నారు.
మీ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వహక అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష పదవి ఒకరైన బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నారా? అని తెలిపారు. పదేళ్లుగా బలహీన వర్గాలకు ఏమీ చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన విధంగా మేమెంతో మకాంత అని కుల గణన తీర్మానాన్ని చేశామన్నారు. 150 కోట్లు రిలీజ్ చేశామని, 17 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. బలహీన వర్గాలకు ఏమైనా జరిగితే అడిగే హక్కు మాకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.