- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sankranti Rangoli: సంక్రాంతి ముగ్గులు వేసి వినూత్న నిరసన.. ఎక్కడంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: సంక్రాంతి (Sankranti) వచ్చిందంటే ఇంటి వాకిళ్ళు ముగ్గులతో అందంగా ముస్తాబవుతాయి. రంగు రంగుల (Rangoli) డిజైన్‌లతో మహిళలు ఇంటి వాకిట్లో ముగ్గులు వేస్తారు. అయితే ఓ గ్రామంలో పలువురు గ్రామస్తులు సంక్రాంతి ముగ్గులు వేసిన ప్రభుత్వంపై నిరసన తెలిపారు. రైతు భరోసా గోవిందా.. తులం బంగారం గోవిందా.. రైతు రుణమాఫీ గోవిందా.. రూ. 4 వేల పింఛను గోవిందా.. మహాలక్ష్మి రూ. 2,500 గోవిందా.. ఆరు గ్యారంటీలు గోవిందా.. కాంగ్రెస్ పార్టీ గోవిందా.. అంటూ ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలం, ముఖ్రాకే గ్రామస్తులు ముగ్గులు వేసి నిరసన తెలిపారు.
ఆరు గ్యారంటీలను నమ్మి మోసపోయామని, వంద రోజులో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని, రైతు భరోసా రూ. 15 వేలు ఇస్తానని చెప్పి రెండు సీజన్లు ఎగగొట్టాడు అని, రుణమాఫీ కాలేదని, ఆరు గ్యారంటీలు బోగస్ అయ్యాయని అన్నారు. రైతు భరోసా రాక పండుగ చేసుకునేదెట్లా అంటూ ఇంటి ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఈ విషయాలను ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ (BRS) పార్టీ వీడియో పోస్ట్ చేసింది.