Ponguleti Srinivas Reddy: ఈనెల 5న ఇందిరమ్మ ఇండ్ల యాప్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

by Prasad Jukanti |
Ponguleti Srinivas Reddy: ఈనెల 5న ఇందిరమ్మ ఇండ్ల యాప్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : డిసెంబర్ 5న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల యాప్‌ను (Indiramma Houses App) ప్రారంభించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఇవాళ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు. తాము మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఏ దళారికి రూపాయి ఇవ్వాల్సిన పనిలేదన్నారు. గత ప్రభుత్వం పెద్దోళ్ల కోసం నిర్ణయాలు తీసుకుని పేదోళ్లను మర్చిపోయిందని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులైన పేదవారికి ఇండ్లు ఇస్తుందని పొంగులేటి స్పష్టం చేశారు.

నమ్మి రాజ్యం అప్పగిస్తే కొల్లగొట్టారు..

సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు ప్రజలు పదేళ్ల నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని మంత్రి తెలిపారు. మాయమాటలు నమ్మి రాజ్యం అప్పగిస్తే గత పాలకులు సంపద కొల్లగొట్టారని ఫైర్ అయ్యారు. వరి వేస్తే ఉరి అని గత సర్కారు అంటే ఇందిరమ్మ ప్రభుత్వం రూ.500 బోనస్ ఇచ్చిందన్నారు.

Next Story

Most Viewed