పూర్తి కాని ప్రాజెక్ట్‌కు ప్రారంభోత్సవమా.. CM KCRపై డీకే అరుణ ఫైర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-13 09:26:23.0  )
పూర్తి కాని ప్రాజెక్ట్‌కు ప్రారంభోత్సవమా.. CM KCRపై డీకే అరుణ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ బోగస్ అని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి కానీ ప్రాజెక్ట్ ను ప్రారంభించేందుకు సీఎం KCRకు సిగ్గు అనిపించడం లేదా అని ఫైర్ అయ్యారు. ఉద్యమ సమయంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఆశలు కల్పించారని వారు భావోద్వేగానికి లోనై సూసైడ్ చేసుకున్నారన్నారు. 1200 మంది ఉసురు పోసుకుని కేసీఆర్ గద్దెనెక్కారన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నాపత్రాలు లీక్ చేశారని ఆరోపించారు. లీకేజీ వెనక ప్రభుత్వం హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.

Next Story

Most Viewed