ఎలక్షన్ కోడ్‌పై అసెంబ్లీ అధికారుల కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2023-10-09 09:35:10.0  )
ఎలక్షన్ కోడ్‌పై అసెంబ్లీ అధికారుల కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ అధికారులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మీడియా ప్రతినిధులు సైతం అసెంబ్లీ ఆవరణలో లైవ్‌లు నిర్వహించొద్దని సూచించారు. ఎవరైనా ఆదేశాలను అతిక్రమిస్తే అసెంబ్లీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం నుంచి అసెంబ్లీ ఆవరణలో సైతం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. మీడియా ప్రతినిధులు, పార్టీల నేతలు ఎన్నికల కోడ్ నేపథ్యంలో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed