Ila Tripathi: పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్.. నల్గొండ కలెక్టర్‌ సంచలన నిర్ణయం

by Shiva |   ( Updated:2025-01-17 08:59:04.0  )
Ila Tripathi: పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్.. నల్గొండ కలెక్టర్‌ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్/నల్లగొండ బ్యూరో: నల్లగొండ కలెక్టర్ ఇల త్రిపాఠీ (Collector Ila Tripathi) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 100 మంది పంచాయతీ కార్యదర్శుల(Panchayat Secretaries) సర్వీస్‌ను బ్రేక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పంచాయతీ కార్యదర్శులు మండల పరిధిలోని ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా గత రెండు నెలలుగా ఒక్కొక్కరు ఒక్కో కారణం చేత గత రెండు నెలల నుంచి విధులకు హాజరు కావడం లేదు.

అయితే, విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇల త్రిపాఠి వారి సర్వీస్‌ను బ్రేక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, వారు తిరిగి విధుల్లోకి చేరేందుకు కలెక్టర్ వద్దకు రాగా.. గైర్హాజరైన రెండు నెలల కాలానికి సర్వీస్ బ్రేక్ చేస్తూ పంచాయతీ కార్యదర్శులకు వేర్వేరు ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. కలెక్టర్ నిర్ణయంతో భవిష్యత్తులో రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్స్, పెన్షన్ల విషయంలో తమకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పంచాయతీ కార్యదర్శులు లబోదిబోమంటున్నారు.

Next Story

Most Viewed