- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Sunita Rao: నాకు పదవి ఇవ్వకుంటే గాంధీభవన్ మెట్ల మీద ధర్నా చేస్తా.. సునీతారావు హాట్ కామెంట్స్

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ మహిళా కాంగ్రెస్ (Mahila Congress) అధ్యక్షురాలు సునీతారావు (Sunitha Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక బీసీ మహిళగా, ముదిరాజ్ బిడ్డగా నామినేటెడ్ పదవికి అన్ని రకాల అర్హతలు తనకు ఉన్నాయని నాకు నామినేటెట్ పదవి ఇవ్వాలని అన్నారు. నన్ను ఎమ్మెల్సీగా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారని నాకు నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేసి పీసీసీ చీఫ్ ను అడ్డుకుంటానని హెచ్చరించారు. ఇవాళ గాంధీభవన్ లో మాట్లాడిన ఆమె పార్టీ కోసం తాను ఎంతో శ్రమిస్తున్నానని మహిళా కాంగ్రెస్ పైన 150కి పైగా కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేసిన సునీతా రావు ఓటమి పాలయ్యారు. తన పదవి విషయంలో గత కొంత కాలంగా ఆమె అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు గౌరవం దక్కకపోవడంపై గతంలో ఆమె గాంధీభవన్ (Gandhi Bhavan) వేదికగా కంటతడిపెట్టుకున్నారు. నామినేటెడ్ (Nominated Posts) పదవుల్లో మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీకి అధిష్టానం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.