- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay Kumar: ‘సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు’
దిశ, కరీంనగర్ : కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ పై సోషల్ మీడియాలో ప్రచారంపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. చెప్పులేసుకుని వేములవాడ రాజన్న ఆలయంలోకి వెళ్లారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. 73 ఏళ్ల ప్రకాశ్ జవదేకర్ దైవ భక్తుడన్నారు. చెప్పులేసుకుని ఆలయంలోకి వెళ్లేంత మూర్ఖుడు కాదన్నారు. చెప్పులు విడిచి సాక్సులతో ఆలయంలోకి వెళ్లారు.
నేను వారితోనే ఉన్నా.’’అని స్పష్టం చేశారు. సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు చేసే ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అయ్యగారిని అడిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఈరోజు కరీంనగర్ లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను పర్యవేక్షించడానికి టవర్ సర్కిల్ వద్దకు వచ్చిన బండి సంజయ్ వద్ద మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా పైవిధంగా బదులిచ్చారు. ప్రకాశ్ జవదేకర్ వయసు 73 ఏండ్లని నడుస్తుంటే జారి కింద పడబోతే పట్టుకున్నానని తెలిపారు. దానిని కూడా ఫాల్తుగాళ్లు రాద్దాంతం చేస్తారా? అంటూ మండిపడ్డారు.
Also Read: బీజేపీలో గ్రూపులు! ఎన్నికల వేళ అంతర్గత సంక్షోభంతో హై టెన్షన్