- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Errabelli: నా ఓటమి నాకు ఆరునెలల ముందే తెలుసు : ఎర్రబెల్లి హాట్ కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్ : శాసనసభ ఎన్నిక(Assembly Elections)ల్లో నేను ఓడిపోతాన(Defeat)ని నాకు ఆరు నెలల ముందే తెలుసని(Six Months Ago).. అయినా కేసీఆర్ ప్రోద్భలంతో పోటీచేశానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టలో కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడిన సందర్భంతో ఎర్రబెల్లి ఎన్నికల్లో తన ఓటమికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కు 100 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారని వెల్లడించారు. రాహుల్ గాంధీ 6 నెలలుగా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని.. ప్రభుత్వ పనితీరుపై ఆరా తీయడానికే ఇటీవల వరంగల్ ఆకస్మిక పర్యటనకు సిద్ధపడ్డారన్నారు. అయితే ఎక్కడ తన పాలనా వైఫల్యాలు బయటపడుతాయోనని..రేవంత్ రెడ్డి ఢిల్లీ పార్టీ పెద్దలతో మాట్లాడి రాహుల్ గాంధీ పర్యటనను రద్దు చేయించారని ఎర్రబెల్లి ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు.
రాష్ట్రాన్ని కేసీఆర్ పదేళ్లు దార్శనికతతో పాలించారని, 15 నెలల్లోనే కాంగ్రెస్ అన్ని రంగాల్లో దివాలా తీయించిందని విమర్శించారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మడం లేదని..ప్రజలు ఆ పార్టీపై పెట్టుకున్న భ్రమలు తొలగిపోయాయన్నారు.
కాగా ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్న పేట నుంచి వరుసగా మూడుసార్లు, పాలకుర్తి నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అరుదైన రికార్డు సాధించాడు. వరంగల్ ఎంపీగా కూడా 2008 ఉప ఎన్నికల్లో గెలిచాడు. 2016లో బీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ రెండోసారి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన ఎర్రబెల్లి 2023ఎన్నికల్లో కాంగ్రెస్ యువ అభ్యర్థిని మామిడాల యశస్వీని చేతితో పరాజయం పాలయ్యాడు.