HYDRAA : హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి సోమవారం?

by Ramesh N |
HYDRAA : హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి సోమవారం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా (Hyderabad Disaster Response and Assets Protection Agency) హైడ్రా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లు, నాలాల సంరక్షణే కాకుండా విపత్తుల నిర్వహణపై కూడా హైడ్రా (HYDRAA) పనిచేస్తుంది. అయితే, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ఏడాదిలో ప్రతి సోమవారం బుద్ధభవన్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.

చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై ఆర్జీలు ఇవ్వొచ్చని హైడ్రా పేర్కొంది. కాగా, ఇటీవల బడంగ్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని పార్కు స్థలం కబ్జా చేశారని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ (Ranganath)కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి పార్కు స్థలం ఆక్రమణకు గురైనట్లు తేల్చి చర్యలు చేపట్టారు. పార్కును కాపాడినందుకు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story