బంజారాహిల్స్ లోని ఆఫ్టర్ 9 పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడులు..

by Disha Web Desk 11 |
బంజారాహిల్స్ లోని ఆఫ్టర్ 9 పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడులు..
X

దిశ, ఖైరతాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆఫ్టర్9 పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆఫ్టర్9 పబ్ నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించడానికి ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి, వారికి మద్యం సేవించి అశ్లీల నృత్యాలు పబ్ లో చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. పబ్బులో మద్యం మత్తులో ఉన్న సుమారు 32 మంది యువతులు, 75 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారికి డిటెక్టివ్ టెస్ట్ చేస్తున్నారు. 35 మంది యువతను సైదాబాద్ లోని రెస్క్యూ హోంకి తరలించారు. నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story