Hyderabad : హైదరాబాద్ లో వేలకొద్ది పాములు.. షాక్ లో నెటిజన్స్

by M.Rajitha |
Hyderabad : హైదరాబాద్ లో వేలకొద్ది పాములు.. షాక్ లో నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని మెట్రో నగరాల్లో(Metro Cities) హైదరాబాద్(Hyderabad) ఒకటి. సకల సౌకర్యాలు, ఆకాశహర్మ్యాలు, ఎయిర్ పోర్ట్స్, మెట్రో.. ఇలా ఎన్నో వసతులతో అంతర్జాతీయ నగరాల్లో ఒకటిగా పేరు సంపాదించింది. అయితే ఇటీవల ఓ సర్వే వివరాలు చూసి నెటిజన్స్ షాక్ గురవుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. నగరంలో 2024లో ఏకంగా 13,028 పాములను(Snakes) పట్టుకొని, వదిలేసినట్టు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ(FOS) పేర్కొంది. గత పదేళ్ళలో 75 వేలకు పైగా పాములు పట్టుకున్నట్టు సొసైటీ సభ్యులు తెలిపారు. కాగా వీటిలో అధికంగా కోబ్రా(Cobra)లే ఉన్నాయట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ మాత్రం వామ్మో..! హైదరాబాద్ లో ఇన్ని పాములు ఉన్నాయా అంటూ షాక్ గురవుతున్నారు.

Next Story

Most Viewed