సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం.. టీజీఈజేఏసీ నిరసనకు పిలుపు

by srinivas |
సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం.. టీజీఈజేఏసీ నిరసనకు  పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. పెన్షన్ విద్రోహ దినం పేరిట సెప్టెంబర్ 1న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనకు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం పర్వత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు జీ సదానందం గౌడ్ పిలుపునిచ్చారు. 2004 సెప్టెంబర్ 1 నుంచి అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల లక్షలాదిమంది ఉద్యోగుల జీవిత భద్రత ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు. దేశంలో నాలుగు రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగిందని గుర్తుచేశారు. మరో రెండు రాష్ట్రాలు ఇది వరకే ప్రకటించిన నేపథ్యంలో మార్చేందుకు ప్రణాళికలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed