తెలంగాణ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కృషి

by Sridhar Babu |   ( Updated:2023-10-03 18:12:18.0  )
తెలంగాణ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కృషి
X

దిశ,ముషీరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేస్తుందని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ​అన్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని చెప్పారు. 30 లక్షల రూపాయల వ్యయంతో ఇందిరాపార్కులో నూతనంగా ఏర్పాటు చేయనున్న కరాటే కోచింగ్​సెంటర్​షెడ్​ నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్​ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన షెడ్ల నిర్మాణంతో పాటు కోచింగ్​కు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్​ నాయకులు ముఠా జైసింహ, షరీపుద్దీన్, ముచ్చకుర్తి ప్రభాకర్, మమ్మద్​అలీ, శంకర్​ముదిరాజ్, ఇందిరాపార్కు ఉద్యానవనశాఖ, అధికారి భాస్కర్​ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story