Hotel Taj Banjara Siege : తాజ్ బంజారా హోటల్ సీజ్

by M.Rajitha |   ( Updated:2025-02-21 05:26:48.0  )
Hotel Taj Banjara Siege : తాజ్ బంజారా హోటల్ సీజ్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లోని ఓ ప్రముఖ హోటల్ కు షాక్ ఇచ్చారు బల్దియా అధికారులు. బంజారాహిల్స్(Banjarahills) లో తాజ్ బంజారా హోటల్(Hotel Taj Banjara) ను అధికారులు శుక్రవారం ఉదయం సీజ్(Sieged) చేశారు. గత రెండేళ్ల నుంచి పన్నులు చెల్లించలేదని.. అనేకసార్లు నోటీసులు పంపినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది జీహెచ్‌ఎంసీ. దాదాపు రూ.1.40 కోట్ల పన్ను బకాయిలను గత రెండేళ్లుగా హోటల్ నిర్వాహకులు చెల్లించలేదని.. నోటీసులకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు హోటల్ సీజ్ చేసినట్టు సమాచారం.ఈ ఘటనపై తాజ్ బంజారా యాజమాన్యంను వివరణ అదిగేందుకు ప్రయత్నించగా.. వారు స్పందించలేదు. తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం ప్రస్తుతం విదేశాలలో వుండటం తో హోటల్ సిబ్బంది యాజమాన్యానికి సీజ్ ఘటన విషయం తెలిపారు.

యాజమాన్యం సీజ్ వెంటనే నిలిపివేయండి , పన్ను బకాయి ఆర్టీజిస్ ద్వారా చెల్లిస్తాము అని జీహెచ్ఎంసీ అధికారులను కోరగా , అధికారులు అందుకు నిరాకరించినట్లు తెలిపారు. పన్ను బకాయి చెల్లించిన తరువాతే సీజ్ ను తొలగిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తాజ్ బంజారా హోటల్ మెయిన్ గేటు ను అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ సిటీలో ఫేమస్ అయిన.. నిత్యం బిజీగా ఉండే తాజ్‌ బంజారా హోటల్‌కు సెలబ్రెటీలు ఎక్కువగా వస్తుంటారు. క్రికెటర్లు ఎప్పుడు వచ్చినా ఈ హోటల్‌లో బస చేస్తుంటారు. అలాగే దేశంలోని కీలక రాజకీయనేతలు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తారు. పార్టీ సమావేశాలకు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ మంది ఈ హోటల్ వైపు మొగ్గుచూపుతారు. అలాంటి హోటల్ సీజ్ కావడం ప్రస్తుతం నగరంలో హాట్ టాపిక్ గా మారింది.

Next Story

Most Viewed