బీఆర్ఎస్ నాయకుల పై కఠిన చర్యలు తీసుకోవాలి.. గీతామూర్తి

by Sumithra |
బీఆర్ఎస్ నాయకుల పై కఠిన చర్యలు తీసుకోవాలి.. గీతామూర్తి
X

దిశ, అంబర్ పేట్ : మహిళల పై దాడులకు పాల్పతున్న బీఆర్ఎస్ నాయకుల పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపి మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి అన్నారు. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖాశర్మను బీజేపి మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి, మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ మాలతి లత, ఎంపీటీసీ శోభారెడ్డి ఢిల్లీలో కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపి ఎంపీటీసీ శోభారెడ్డిని బీఆర్ఎస్ మహిళా ఎంపీటీసీలు అవమానించారని, భౌతిక దాడులకు పాల్పడ్డారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బెల్లంపల్లి బీఆర్ఎస్ శాసన సభ్యుడు దుర్గం చిన్నయ్య, అదే గ్రామానికి చెందిన షేజల్ అనే అమ్మాయిని లైంగికంగా వేధించాడంతో అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడి ప్రస్తుతం ఢిల్లీలో చికిత్స పొందుతున్నారని గీతామూర్తి తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న శాసన సభ్యులను కఠినంగా శిక్షించాలని చైర్మన్ ను కోరినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed