బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..

by Sumithra |   ( Updated:2023-04-05 10:26:56.0  )
బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..
X

దిశ, శేరిలింగంపల్లి : రోజుకో పేపర్ లీకేజీ అవుతుంటే రాష్ట్రప్రభుత్వం చోద్యం చూస్తుందని, ప్రశ్నించిన ప్రతిపక్ష బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు బీజేపీ నాయకులు. బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా బుధవారం భారతీయ జనతా పార్టీ ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ చౌరస్తాలో డివిజన్ అధ్యక్షులు గాలిపల్లి కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రనాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థుల, నిరుద్యోగుల బ్రతుకులను నాశనం చేస్తూ రోజుకో పేపర్ లీకేజీ అవుతుంటే బీఆర్ఎస్ రాష్ట్రప్రభుత్వం చోద్యం చూస్తుందని, ఆ లీకేజీల వెనక ఎవరున్నారో నిజానిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.

పేపర్ల లీకేజీలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ఎక్కడ బీజేపీ వాళ్లు ప్రశ్నిస్తే అక్కడ అరెస్ట్ లు చేస్తున్నారని, రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని అన్నారు. అర్ధరాత్రి అక్రమంగా బీజేపీ రాష్ట్రఅధ్యక్షులు బండిసంజయ్ ను అరెస్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు రామరాజు, నరేందర్ రెడ్డి, నర్సింగ్ యాదవ్, కుమార్ యాదవ్, మణిభూషణ్, రవీందర్రావు, వెంకటస్వామి రెడ్డి, నర్సింగ్ రావు, అనిల్ కుమార్ యాదవ్, గోపాల్ రావు, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రఘు, రాజు, ఎత్తరి రమేష్, సందీప్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, గణేష్ , రామచంద్రుడు, అమర్నాథ్, శ్రీనివాస్, అశోక్, రవి, రాయల్, నరేష్, అనిత, పార్వతి, కవిత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story