- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'ధనిక రాష్ట్రం అంటూనే జనాలను జలగల్లా పీల్చుకుతింటుండు'
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అప్పులపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర పరిస్థితి ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ అన్నట్టుగా ఉందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం కిస్తీలకే మిగలట్లేదని, రాష్ట్రం ఏర్పడిన నాటికి రాష్ట్ర సంపద రూ. 16 వేల కోట్లు ఉంటే ఇప్పుడు అప్పు రూ. 4.50 లక్షల కోట్లకు చేరిందని ఆరోపించారు. దొర చేసిన అప్పులకు ఎనిమిదిన్నరేళ్లుగా రూ. లక్షల కోట్ల వడ్డీ కట్టారని ఆరోపించారు. ఇంత అప్పు చేసినా జనానికి ఒరిగిందేమి లేదనీ, ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ తోపాటు ఉద్యోగులకు జీతాలకు కూడా అతీగతి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. తిన్నది కల్వకుంట్ల కుటుంబం అయితే అప్పు కట్టేది జనం అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో రూ. 860 కోట్లకు వడ్డీలు మీరే తినాలే.. రాష్ట్ర అప్పులకు వడ్డీలు మాత్రం జనాలు కట్టాల్నా అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం అంటూనే జనాలను జలగల్లా పీల్చుకు తింటున్నాడని, బంగారు తెలంగాణ చేశానని ఇక బంగారు భారత్ చేస్తానంటూ దేశాన్ని దోచుకోవడానికి కేసీఆర్ బయలుదేరాడని విమర్శించారు. ఒక్కొక్కరి నెత్తిన రూ. లక్షన్నర అప్పు పెట్టి, రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశాడని మండిపడ్డారు.
- Tags
- YS Sharmila
- YSRTP