ఎన్నికలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలి : జనరల్ అబ్జర్వర్

by Disha Web Desk 11 |
ఎన్నికలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలి : జనరల్ అబ్జర్వర్
X

దిశ, ఖైరతాబాద్ : హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గత 72 గంటల్లో ఎన్నికలకు సంబంధించి చేపట్టిన చర్యల వివరాలను సమర్పించాలని హైదరాబాద్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ పి ఐ శ్రీవిద్య అధికారులను సూచించారు. శనివారం హైదరాబాద్ కలెక్టర్ ఛాంబర్ లో ఐటీ,ఎం సి సి, ఆర్ ఓ ఆఫీస్ రిపోర్ట్స్ అధికారితో సువిధ,ఎన్కోర్, సాక్ష్యం, సి విజిల్, ఎం సి సి ఉల్లంఘనలపై తీసుకున్న చర్యలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 72 గంటలలో ఎన్నికలకు సంబంధించిన ఏమేమి చర్యలు తీసుకున్నారో రిపోర్టు సమర్పించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా ఉంటే 1950 ఓటర్ హెల్ప్ లైన్, టోల్ ఫ్రీ నెంబర్ 18005992999 కు లేదా (ngsp.eci.gov.in) నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ ద్వారా రాజకీయ పార్టీలు, ప్రజలు ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, లా ఆఫీసర్ చారి,జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఆశన్న, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ రజిత, గీత,ఎలక్షన్ తహసీల్దార్ జహురుద్దీన్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed