కలకలం రేపుతున్న రాజాసింగ్ ఫ్టెక్సీలు

by Sridhar Babu |
కలకలం రేపుతున్న రాజాసింగ్ ఫ్టెక్సీలు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : గోషామహల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండరని, తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో ఎమ్మెల్యే రాజాసింగ్ పోటీకి అన్ ఫిట్ అంటూ ఫ్లెక్సీ ల్లో ప్రచురించారు. కోఠి, అబిడ్స్, ఎంజే మార్కెట్, జుమ్మెరాత్ బజార్ చౌరస్తాలలో రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెయ్యి పొర్లు దండాలు పెట్టి రూ.1000 కోట్లు పంచినా ప్రజలు రాజాసింగ్ కు ఓటు వేయరని అన్నారు. గడిచిన 9 ఏండ్లలో ఎమ్మెల్యేగా రాజాసింగ్ నియోజకవర్గం అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా స్పీచ్ లు ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికలలో రాజాసింగ్ కు బుద్ధి చెప్పేందుకు నియోజకవర్గ ఓటర్లు ఎదురు చూస్తున్నారని జోష్యం చెప్పారు.



Next Story

Most Viewed