- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోకుల్ ప్లాట్స్ లో పాక్షికంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత
X
దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్ లో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది శుక్రవారం కూల్చివేశారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, సెట్ బ్యాక్ లు కూడా లేకుండా 6, 7 అంతస్తులు కడుతున్న నేపథ్యంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన
జీహెచ్ఎంసీ అధికారులు పాక్షికంగా కూల్చివేతలు చేపట్టారు. అక్రమ నిర్మాణాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నా, ఓ వైపు ప్రమాదాలు జరుగుతున్నా బిల్డర్లు నిర్మాణాలను ఆపడం లేదని, ఎలాంటి భద్రతపరమైన చర్యలు తీసుకోకుండా నిర్మాణాలు సాగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజల నుండి డిమాండ్లు ఉన్నాయి. అయితే జీహెచ్ఎంసీ అధికారులు పాక్షికంగా కూల్చివేతలు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
Read More..
Advertisement
Next Story