నిలోఫర్ ఆస్పత్రిలో మూడురోజుల శిశువును వదిలేసిన తల్లిదండ్రులు

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-04 06:21:50.0  )
నిలోఫర్ ఆస్పత్రిలో మూడురోజుల శిశువును వదిలేసిన తల్లిదండ్రులు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: చెట్టుకు కాయబారం కాదంటారు. కానీ ఓ తల్లికి నవమాసాలు మోసి కన్నబిడ్డ భారమైంది. పుట్టిన మూడు రోజులలోనే చిన్నారిని వదిలి వెళ్ళిపోయింది. ఈ సంఘటన నీలోఫర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆస్పత్రి ఆవరణలో నిలిపి ఉన్న ఓ ఆటోలో మూడు రోజుల మగ శిశువు కవర్లో చుట్టి ఉండడాన్ని గుర్తించిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి అధికారులకు సమాచారం ఇచ్చారు. తల్లి గురించి ఆరా తీసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ శిశువును ఆస్పత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే చిన్నారికి కామెర్లు, అంగవైకల్యం ఉండటంతోనే తల్లిదండ్రులు వదిలి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో ఆస్పత్రిలో జరిగిన ప్రసవాల వివరాలు సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజ్ లో నమోదైన ఆధారాలు సేకరించేందుకు ఆసుపత్రి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Next Story