Osmania Medical College : ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఐఎస్ఓ 9001-2015 గుర్తింపు

by Sridhar Babu |
Osmania Medical College : ఉస్మానియా మెడికల్ కాలేజీకి  ఐఎస్ఓ  9001-2015 గుర్తింపు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : ఉస్మానియా వైద్య కళాశాలకు ఐఎస్ఓ 9001-2015 గుర్తింపు దక్కింది. ఈ మేరకు గురువారం ఆ సంస్థ ప్రతినిధి శివయ్య గుర్తింపు పత్రాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్ర కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేంద్రకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కూడా ఐఎస్ఓ గుర్తింపు తమ కళాశాలకు దక్కడం అభినందనీయం అన్నారు.

కాలేజీలో అందిస్తున్న నాణ్యమైన విద్య ప్రమాణాలు, భద్రత సామర్థ్యం , కళాశాలలోని గ్రీన్ ఎన్విరాన్మెంట్, ఉన్నత బోధన, కళాశాలలోని అన్ని స్థాయిల ఉద్యోగుల కృషి వలన ఇంతటి గుర్తింపు లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ శంకర్, డాక్టర్ పద్మావతి, ఏడీ డాక్టర్ శ్రీధర్ చారి, మాజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ తకియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed