సీఐ భార్య వ్యవహారంలో కొత్త ట్విస్ట్..

by Kalyani |   ( Updated:2025-02-10 08:35:00.0  )
సీఐ భార్య వ్యవహారంలో కొత్త ట్విస్ట్..
X

దిశ, కార్వాన్ : అబిడ్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నరసింహ భార్య తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తునట్టు శనివారం సిటీ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన విషయం కలకలం రేకెత్తించిన విషయం తెలిసిందే. కాగా నరసింహం ఆదివారం తన భార్య పై సంచలన ఆరోపణలు చేశాడు. తన భార్య ఇద్దరు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలిపారు. సమీప బంధువు ఏఆర్ కానిస్టేబుల్స్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని, అక్రమ సంబంధం పై భార్యను ప్రశ్నించడం తో సీఐ నరసింహ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమ సంసారం నాశనం అవుతుందని, పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు భార్యను హెచ్చరించినా ఆమె తీరు మారలేదన్నారు.

గతంలోనే ఎస్పీ కార్యాలయంలో పంచాయితీ చేసి భార్యను తెచ్చుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా భర్తకు తెలియకుండా అక్రమ సంబంధం కొనసాగించిందని, ప్రియుడు ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందని, దానిని గుట్టుచప్పుడు కాకుండా తీయించకున్నట్లు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు.. సంతోషంగా జీవితాన్ని లీడ్ చేద్దాం అని భార్యకు చెప్పినా వినలేదని, తన భార్య గురించి అన్ని విషయాలు తెలిసిన చాలా ఓపిగ్గా మౌనంగా ఉన్నట్లు నరసింహ తెలిపారు. పుట్టింటికి వెళ్లిన సమయంలో నకిరేకల్ లో ప్రైవేటుగా ప్రియుడిని కలుసుకుంటుందని, హైదరాబాద్ లో కాపురానికి వచ్చిన సమయంలో కూడా గంటలు తరబడి ప్రియుడితో కాల్స్ మాట్లాడేదని వాపోయాడు. అడిగినంత డబ్బులు ఇవ్వక పోతే కేసు పెట్టి, ఉద్యోగం తీయిస్తానని బెదిరింపులకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Next Story