- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిజామాబాద్‌లో కవితకు మూడో స్థానమే....!
దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను నిజామాబాద్‌లో ఓడిస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆమెకు అక్కడ మూడో స్థానమే దక్కుందని ఆయన జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన అర్వింద్.. ఎన్నికల నిధుల కోసం ప్రభుత్వ బియ్యాన్ని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. బియ్యం అమ్మకాలతో రూ.4 వేల కోట్లు కుంభకోణానికి తెర తీశారని తెలిపారు. గద్దెపై రాబందులు బియ్యం అమ్ముకుంటున్నాయని.. గద్దె కింద పందికొక్కులు బియ్యం తింటున్నాయని సెటైర్లు వేశారు. బియ్యం బ్లాక్ మార్కెట్ దందా జరుగుతోందని.. అందులో మంత్రి కేటీఆర్‌దే ప్రధాన పాత్ర అని అర్వింద్ తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం అమ్మకంపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత స్పందించాలన్నారు. కిలో రూ. 6 కంటే తక్కువకు పెద్ద వ్యాపారులకు బియ్యం అమ్మేందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ప్రభుత్వం మాత్రం బియ్యం అమ్మకాలు చేపడితే మిల్లర్లు తీవ్రంగా నష్టపోతారని ఎంపీ అర్వింద్ హెచ్చరించారు.