- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో ఇదే డిక్లరేషన్‌ను అమలు చేసే దమ్ముందా?.. ఖర్గేకు మంత్రి సత్యవతి సవాల్
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో ఇదే డిక్లరేషన్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించే దమ్ముందా అని మంత్రి సత్యవతి రాథోడ్ సవాల్ విసిరారు. కర్ణాటకలో అమలు చేసి తెలంగాణలో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలు వెనుకబడటానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని, కాంగ్రెస్ నేతలు తప్పుడు డిక్లరేషన్ ప్రకటించారని, వారి డిక్లరేషన్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్ పేరుతో ఆ పార్టీ సభ పెట్టడం హాస్యాస్పదం అన్నారు. మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ఎస్సీ, ఎస్టీ మేధావులు భూటకపు మాటలను నమ్మోద్దని విజ్ఞప్తి చేశారు. కర్నాటక ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదని, ఇంకా ఎన్నిరోజులు ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేకుండా ఎందుకుపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేసేందుకు పనిగట్టుకొని ప్రయత్నం చేస్తున్నారని, పదిమంది కలిసిపోయే పరిస్థితి ఆపార్టీలో లేదని, కోట్లాది ప్రజలు ఎందుకు ఓటువేయాలని సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీలకు మూడుకార్పొరేషన్లు ఎలా ఇస్తారో సమాధానం చెప్పాలన్నారు. ఒక్క సంవత్సరంలోనే 4 లక్షల మందికి పోడు పట్టాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. హైదరాబాద్‌లో కుమ్రంభీం, సేవాలాల్ భవనాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిందని, కాంగ్రెస్‌కు సేవాలాల్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చారని ఆమె ప్రశ్నించారు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే కాంగ్రెస్ పార్టీ దుర్భుద్ధిఅని, కాంగ్రెస్ కపట మాటలను దళిత, గిరిజన బిడ్డలు నమ్మొద్దన్నారు. చైతన్యవంతమైన దళిత, గిరిజన బిడ్డలు కాంగ్రెస్ కుట్రలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో మాయలఫకీర్లు వస్తారని, ప్రజలు చైతన్యంతో తరిమికొట్టాలని, కాంగ్రెస్ కపట ప్రేమను నమ్మోద్దని దళిత, గిరిజనులను కోరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రావన్నారు. ఒక్క రాష్ట్రంలో అధికారం కోసం మోసపూరిత మాటలు మానుకోవాలని సూచించారు.
ఎంపీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ నమ్మశక్యంగా లేదన్నారు. కర్నాటక ఎన్నికల్లో ఇచ్చిన 21 అంశాలను అమలుచేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఖర్గేను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 100కుపైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ మాట్లాడకుండా బీజేపీతో అంటకాగుతున్నారని మండిపడ్డారు. శరద్ పవర్ రాహుల్ తో ఉంటూ మోడీతో చెట్టాపట్టాల్ వేస్తున్నాడని దానిని ఏమాలని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్ , తక్కెళ్లపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు.