- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ నెల 12న ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో ధర్నా.. మైదంశెట్టి రమేశ్
దిశ, మియాపూర్: శేరిలింగంపల్లి మండల కార్యాలయం ముందు ఈ నెల 12న ధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి మైదంశెట్టి రమేశ్ తెలిపారు. ఎంసీపీఐ(యూ) మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్టాలిన్ నగర్ లో ధర్నా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని శనివారం పార్టీ ముఖ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. మియాపూర్ లోని సర్వేనెంబర్ 28లో నివసిస్తున్న నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్, ఓంకార్ నగర్ వాసులపై సీఆర్పీఎఫ్ ఆగడాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. ఇండ్లు లేక వాళ్లంతా నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు అందించాలని కోరారు.
దళిత బంధు పథకాన్ని కేవలం అధికార పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని విమర్శించారు. ప్రజా సమస్యల సాధనకై ఈ నెల 12న నిర్వహించనున్న ధర్నాకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్స్, పల్లె మురళి, ఇస్లావత్ దశరథ్ నాయక్, పార్టీ నాయకులు, మైదం శెట్టి రాణి, గూడ లావణ్య, దార లక్ష్మి, డి.రంగస్వామి, ఖాదర్ వలి తదితరులు పాల్గొన్నారు.