ప్రపంచ ధరిత్రి దినోత్సవం.. పలువురు ప్రొఫెసర్లకు సన్మానం..

by Sumithra |
ప్రపంచ ధరిత్రి దినోత్సవం.. పలువురు ప్రొఫెసర్లకు సన్మానం..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా పలువురు ప్రొఫెసర్లను ఘనంగా సన్మానించనున్నట్లు తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ మేధావుల ఫోరమ్, వివేకవర్ధని డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జాంబాగ్ లోని వివేకవర్ధని డిగ్రీ కళాశాలలో మంగళవారం 11 గంటలకు ధరిత్రి సంరక్షణ పై ఒక సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె పురుషోత్తంరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తారని వివించారు.

విశిష్ట అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ జియాలజీ డిపార్ట్మెంట్ మాజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం మురళీధర్, వీవీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.విద్యాధర్ తో పాటు డాక్టర్ జగ్దేవి మూలయ్, డాక్టర్ ఎన్ మీనాక్షి, ఎన్సీసీ ఆఫీసర్ పి.వేణు, కాకి సదానంద స్వామి ముదిరాజ్, కాశముని శ్యామ్ రావుతదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత 40ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణకై ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలను పర్యావరణం పరిరక్షణ, కాలుష్య నియంత్రణ పై నిరంతరం ప్రజలను ర్యాలీల, సెమినార్ల సదస్సుల ద్వారా ఎన్నోవేల కార్యక్రమాలు నిర్వహిస్తున్నం ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ మాజీ హెచ్ఓడీ ప్రొఫెసర్ కే.పురుషోత్తం రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ జియాలజీ మాజీ హెచ్ఓడీ ప్రొఫెసర్ ఎం.మురళీధర్ లను శాలువా, మెమొంటో, పూలమాలతో సన్మానిస్తున్నట్టు రాజ్ నారాయణ్ ముదిరాజ్ తెలిపారు.

Advertisement

Next Story